ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకునే క్రమంలో అపశృతి చోటు చేసుకొంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) స్వాగత ఏర్పాట్లలో భాగంగా జోగి రమేష్ నివాసం వద్దకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. పల్స్ పడిపోవడంతో అక్కడున్న నేతలు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో తాడేపల్లి నుంచి సుమారు ఆరు గంటల పాటు ప్రయాణించిన జగన్ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. గతంలో టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాంబాబు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పార్టీ నేతలు తెలిపారు. జగన్ పర్యటన నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ముందుగానే ఆంక్షలు విధించింది. నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రూట్ మ్యాప్‌ను మార్చాలని సూచిస్తూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నోటీసులు జారీ చేశారు. ధాన రహదారులపై రాకపోకలు అధికంగా ఉండటంతో వెస్ట్ బైపాస్ మార్గం ద్వారా జోగి రమేష్ నివాసానికి వెళ్లాలని సూచించారు. ఈ మార్గనిర్దేశంతో పాటు నగరమంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఇబ్రహీంపట్నం పరిసరాల్లో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రింగు రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో బైక్‌లతో గుంపులుగా తిరుగుతూ హల్‌చల్ చేశారు. బైక్‌పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ఉన్న గేట్‌ను వేగంగా ఢీకొని మరో వ్యక్తి మృతి చెందాడని సమాచారం. కొందరు నేతలు అక్కడే ఉన్నప్పటికీ, కార్యకర్తలను నియంత్రించేందుకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని స్థానికులు అంటున్నారు. జన సమీకరణ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బలగాలను మోహరించారు. నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో కేడ్లను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలు చేపట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. అయితే, కొందరు కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి.
జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి : ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మృతి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق