ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇస్తూ రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ లో ఉన్న 46 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్లు కోసం 839.44 కోట్లు ఖర్చు చేశాయని, పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి చేనేతలకు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని కూడా ప్రకటించారు.
వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ లో ఉన్న 46 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق