మెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపు వెళ్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించే అవసరం రావొద్దని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహకనౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' పశ్చిమాసియాకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధ నౌకల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచేశాయి. మరో యుద్ధనౌక ఇరాన్ వైపు వెళ్తోందని, వారు ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నామని ట్రంప్ అన్నారు. ఇప్పటికే వాళ్లు దాన్ని చేసుకోవాల్సి ఉందని, దీనికి వారు సిద్ధంగా ఉన్నట్లు నాకు తెలుసని అన్నారు. వాళ్లు చాలాసార్లు తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఈ ప్రాంతం వైపు తరలిస్తున్నట్లు మరో అమెరికా అధికారి చెప్పారు.

Post a Comment

أحدث أقدم