హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ముత్యాలమ్మగూడెం సమీపంలో 65వ జాతీయ రహదారిపై లో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ వేగంగా నడుపుతూ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టాడని తెలుస్తోంది. బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం తరువాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అటు బస్సును తరలించడానికి క్రేన్‌ను మోహరించడంతో హైవేపై ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లింది.

Post a Comment

أحدث أقدم