సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ కు ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అదనపు బోగీల్ని అమర్చాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీంతో రద్దీ సమయాల్లో ప్రయాణికులకు అదనపు సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 22204, అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణించే దురంతో రైలు నంబర్ 22203 కూ ఏసీ థర్డ్ క్లాస్ లో మరో మూడు అదనపు బోగీలు అమర్చాలని రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్-విశాఖ దురంతోకు ఈ నెల 24 నుంచి, విశాఖ-సికింద్రాబాద్ దురంతో రైలుకు ఈ నెల 25 నుంచి ఈ ధర్డ్ ఏసీ క్లాస్ అదనపు బోగీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అనకాపల్లి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లకు సైతం ఇలా ధర్డ్ ఏసీ అదనపు బోగీలు అమర్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లు నంబర్లు 07055, 07056కు మూడేసి ధర్డ్ ఏసీ కోచ్ లు అమర్చబోతున్నారు. సికింద్రాబాద్-అనకాపల్లి రైలుకు ఈ నెల 22 నుంచి, అనకాపల్లి-సికింద్రాబాద్ రైలుకు ఈ నెల 23 నుంచి ఇలా మూడేసి ధర్డ్ ఏసీ అదనపు కోచ్ లు అందుబాటులోకి తెస్తున్నారు.
విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ కు అదనపు బోగీలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق