బీహార్ రాష్ట్రానికి చెందిన సోనాలి సింగ్ అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో నివసిస్తోంది. 31ఏళ్ల ఆ మహిళ కేఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుస్తుండగా ఆమె డ్రెస్సింగ్ చూసి కొంతమంది అబ్బాయిలు కామెంట్ చేశారు. అది గమనించి, అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డ్ లక్ష్మీనరసమ్మ ఆ అబ్బాయిలను బెదిరించి పంపించేసింది. తర్వాత.. "రోడ్డుపైకి వచ్చినప్పుడు నిండుగా బట్టలేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదమ్మా" అని మహిళా హోంగార్డ్ యువతికి సలహా ఇచ్చింది. హోంగార్డు చెప్పిన మాటలకు ఆగ్రహానికి గురైన సోనాలి సింగ్, ఆమెతో వాగ్వాదానికి దిగింది. "నేను ఏం వేసుకోవాలో చెప్పడానికి నువ్వు ఎవరు?" అంటూ కేకలు వేస్తూ, ఆమె చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, చెంప దెబ్బలు కొట్టింది. విధుల్లో ఉన్నదని కూడా చూడకుండా అందరి ముందే అసభ్య పదజాలంతో తిట్టింది. హోంగార్డును రోడ్డుపైనే జుట్టుపట్టుకొని రక్తమొచ్చేలా కొట్టింది. అది చూసిన స్థానికులు హోంగార్డును మహిళ నుంచి కాపాడారు. తర్వాత హోంగార్డు ఫిర్యాదుతో యువతిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. యువతి లేడీ హోంగార్డుని జుట్టుపట్టుకొని కొట్టడం స్థానికులు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోడ్డుపైకి వచ్చినప్పుడు మంచిగా బట్టలు వేసుకోవచ్చు అన్నందుకు మహిళా హోంగార్డుని కొట్టిన యువతి
الثلاثاء، 13 يناير 2026
A young woman assaulted a female home guard for suggesting she dress appropriately when going out on the road banglore karnataka national
ليست هناك تعليقات:
إرسال تعليق