తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శ్రీకర్ అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్‌లో నష్టాలు రావడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. గత కొంత కాలంగా శ్రీకర్ ఆన్‌లైన్ బెట్టింగ్స్, రమ్మీ వంటి గేమ్స్‌కి బానిసయ్యాడు. తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగా వారించినా వారి మాటలు పట్టించుకోలేదు. తొలుత చిన్న మొత్తాల్లో లాభాలు రావడంతో, మరింత ఆశతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేసి ఆడటం మొదలు పెట్టాడు. గత రెండు సంవత్సరాలుగా సుమారు 20 లక్షల వరకు ఆన్‌లైన్ గేమ్‌లో నష్టపోయాడని బాధితుడు తల్లి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకర్ మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడు ఏ ఏ యాప్‌లలో ఎంత డబ్బు పోగొట్టుకున్నాడు, ఎవరెవరు అతన్ని వేధించారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండేళ్లుగా ఎన్నో చోట్ల అప్పులు తీసుకున్నాడని, ఇటీ వల అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడి ఉండవొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల డిజిటల్ యాక్టివిటీస్ పై దృష్టి సారించాలని, బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమింగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్‌లో నష్టాలు : ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిన యువకుడు
الجمعة، 2 يناير 2026
addicted to online betting and games like Rummy Criem Kamareddy district Losses in online gaming telangana Young man commits suicide by hanging
ليست هناك تعليقات:
إرسال تعليق