హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలో నేషనల్ హైవే 65 సర్వీస్ రోడ్డుపై తండ్రి కొడుకులు పండుగకు సొంత ఊరెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రికి తీవ్రగాయాలై స్పాట్లోనే దుర్మరణం చెందాడు. కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హయత్ నగర్ సీఐ నాగరాజ్ గౌడ్ వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంజి అశోక్ (55) హయత్‌నగర్ పరిధిలోని మునగనూరులో ఉంటూ చేనేత కార్మికుడిగా పనిచేసుకుంటున్నాడు. గురువారం సంక్రాంతి పండుగ కావడంతో బుధవారం తన కుమారుడు ఉమాకాంత్‌తో కలిసి పల్సర్ బైక్‌పై ఊరికి బయలుదేరారు. బైక్‌ను ఉమాకాంత్ నడుపుతుండగా వారిద్దరూ మునగనూర్ నుంచి NH-65 సర్వీస్ రోడ్డు మీదుగా పెద్దఅంబర్‌పేట వైపు వెళ్తున్నారు. సీతారాంపురం కమాన్ సమీపంలోకి చేరుకోగానే సుజుకి యాక్సెస్ బైక్ వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఉమాపతి స్వల్ప గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజ్‌గౌడ్ తెలిపారు.
0 Comments