ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానం యూ-టర్న్ తీసుకుని తిరిగి వాషింగ్టన్‌కు చేరుకుంది. మంగళవారం వాషింగ్టన్ నుంచి బయల్దేరిన సమయంలో ఎలక్ట్రికల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు సమాచారం. భద్రతా కారణాలతో పైలట్లు వెంటనే విమానాన్ని తిరిగి అమెరికాకు మళ్లించినట్లు వర్గాలు వెల్లడించాయి. దావోస్‌లో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ హాజరు కావాల్సి ఉండగా, అనుకోని సాంకేతిక సమస్యతో ఆయన పర్యటన రద్దైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

Post a Comment

أحدث أقدم