గ్లోబల్ మార్కెట్‌లో త్వరలో మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా మోటోరోలా ఎక్స్70 ఎయిర్ ప్రో పేరుతో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. లిస్టింగ్ (XT2603-1 మోడల్ నంబర్) ప్రకారం దీనిలో 6.78 అంగుళాల 1.5K (1264 × 2780 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే ఉండనుంది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 3.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండటం గమనార్హం. దీన్ని బట్టి ఇందులో Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఉండొచ్చని అంచనా. లిస్టింగ్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో Adreno 829 GPU, అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా వచ్చే అవకాశముంది. 8GB, 12GB, 16GB RAM వేరియంట్లలో విడుదల చేయవచ్చు. స్టోరేజ్ పరంగా 256GB, 512GB, అలాగే గరిష్టంగా 1TB వరకు ఆప్షన్లు ఉండొచ్చని సూచిస్తోంది. అయితే ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు మద్దతు ఉండకపోవచ్చు. ఫోటోగ్రఫీ విభాగంలో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్‌కు మద్దతిచ్చే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండనుంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ డివైస్‌లో AI ఆధారిత ఇమేజింగ్ ఫీచర్లు కూడా ఉంటాయని మోటరోలా ఇప్పటికే టీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,100mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్ 3C సర్టిఫికేషన్‌లో 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌కు మద్దతుతో కనిపించింది. అలాగే వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశముంది. బ్లూటూత్, USB కనెక్టివిటీతో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వనున్నారు. గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ వంటి ఇతర సెన్సార్లు కూడా ఇందులో ఉంటాయి.
ホーム
/
technology
/
త్వరలో మార్కెట్‌లోకి మోటోరోలా ఎక్స్70 ఎయిర్ ప్రో !
الجمعة، 2 يناير 2026
6.78-inch 1.5K (1264 × 2780 pixels) OLED display fold smart phone Motorola X70 Air Pro Coming Soon to the Market science technology
ليست هناك تعليقات:
إرسال تعليق