కొమాకి ఎక్స్ఆర్7 ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధిక రేంజ్ ఇస్తున్న స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 322 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సాధారణంగా ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్ల ధరలు లక్షన్నర పైన ఉంటాయి. కానీ కొమాకి ఎక్స్ఆర్7 ధర సామాన్యులకు అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మార్కెట్లో పాపులర్ అయిన ఓలా, ఏథర్ వంటి బ్రాండ్ల బేస్ మోడల్స్ కంటే ఇది తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ స్కూటర్ గ్రే, రెడ్, బ్లాక్, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్కూటర్‌లో కంపెనీ అత్యంత సురక్షితమైన లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని ఉపయోగించింది. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి పేలిపోయే ప్రమాదం చాలా తక్కువ. ఈ బ్యాటరీ 3000 నుండి 5000 ఛార్జింగ్ సైకిల్స్ వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే కొన్నేళ్ల పాటు బ్యాటరీ మార్చే పని ఉండదు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సామాన్లు పెట్టుకోవడానికి స్థలం తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో సీటు కింద ఏకంగా 35 లీటర్ల బూట్ స్పేస్ ఇచ్చారు. హెల్మెట్, కూరగాయలు, ఇతర సరుకులు ఈజీగా పడతాయి. 3000 వాట్ల BLDC హబ్ మోటార్‌ను అమర్చారు. గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. సిటీ రైడింగ్‌కు ఇది సరిపోతుంది. డిస్క్ బ్రేక్స్, పార్క్ అసిస్ట్, ఆటో రిపేర్ స్విచ్, 12 అంగుళాల చక్రాలు, డిజిటల్ డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కంపెనీ మంచి వారంటీని ఆఫర్ చేస్తోంది. బ్యాటరీ, మోటార్, కంట్రోలర్‌పై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ లభిస్తుంది. ఛార్జర్‌పై ఒక సంవత్సరం వారంటీ ఉంది.
322 కిలోమీటర్ల మైలేజీని ఇస్తున్న కొమాకి ఎక్స్ఆర్7 ఎలక్ట్రిక్ స్కూటర్
السبت، 31 يناير 2026
automobile business electric scooter national technology The Komaki XR7 electric scooter offers a mileage of 322 kilometers
ليست هناك تعليقات:
إرسال تعليق