ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపేన్ పై 200 శాతం టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైన్‌లు, షాంపైన్‌లపై 200 శాతం టారిఫ్ విధిస్తాననని, అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మక్రాన్ ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరతాడని వ్యాఖ్యానించారు. బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ అయిష్టతను వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తాజా పరిణామాలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆందోళనలను పెంచింది. అమెరికాకు వైన్ ఎగుమతుల వల్ల ఫ్రాన్స్ భారీగా ఆదాయాన్ని పొందుతోంది. ఇది ఆ దేశ ప్రతిష్ట, జాతీయ గుర్తింపుకు చిహ్నంగా పరిగణిస్తుంటారు. వాటిపై ఏకంగా 200 శాతం టారిఫ్ విధించితే రెండు మిత్రదేశాల మధ్య శతాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఫ్రాన్స్ వైన్, షాంపేన్ పై 200 శాతం టారిఫ్ విధిస్తాం : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق