పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని గుల్‌ప్లాజాలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడినట్లు సీనియర్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఘటన జరిగింది. మాల్‌లో దిగుమతి చేసుకున్న దుస్తులు, ప్లాస్టిక్ గృహోపకరణాలను నిల్వ చేసిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది గుల్ ప్లాజాకు చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది. కరాచీ మరియు దేశంలోని చాలా నిర్మాణాల్లో అగ్నిమాపక వ్యవస్థలు లేవని, వీటివల్ల తరచుగా ప్రమాదాలు, ప్రాణనష్టం జరుగుతోందని అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
షాపింగ్మాల్లో అగ్ని ప్రమాదం : ముగ్గురు మృతి, 12 మంది గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق