శాంసంగ్ తాజా మెజర్ అప్‌డేట్ One UI 8.5 ను బీటా వెర్షన్‌గా విడుదల చేసింది. ఈ అప్‌డేట్ పూర్తి స్థాయిలో 2026లో విడుదల కానున్నప్పటికీ, ఇప్పుడే అందులో వచ్చే కొత్త ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. One UI 8లో స్ప్లిట్ Quick Panel పరిచయం చేసిన సామ్‌సంగ్, One UI 8.5లో దానిని పూర్తిగా కస్టమైజ్ చేయగలిగేలా మార్చింది. ఇప్పుడు ప్రతి టాగుల్, స్లైడర్ లేఅవుట్‌ను యూజర్ తనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. అలాగే కొత్త కంట్రోల్స్ జోడించేందుకు రిఫ్రెష్ చేసిన UIను తీసుకొచ్చింది. One UI 8.5లో సామ్‌సంగ్ తన డిజైన్ లాంగ్వేజ్‌ను అప్‌డేట్ చేసింది. శాంసంగ్ యాప్స్‌లోని ఐకాన్‌లకు స్వల్పంగా 3D ఎఫెక్ట్ ఇవ్వబడింది. అలాగే ఫస్ట్-పార్టీ యాప్స్‌లో కూడా ఇదే లుక్ కనిపిస్తుంది. కొన్ని UI ఎలిమెంట్స్ Apple యొక్క 'Liquid Glass' డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, పూర్తిగా అదేలా కాకుండా సాఫ్ట్ ట్రాన్స్‌పరెన్సీతో రూపొందించబడ్డాయి. 'My Files' యాప్‌లో Storage Share అనే కొత్త ఫీచర్ వచ్చింది. దీనివల్ల సమీపంలో ఉన్న ఇతర సామ్‌సంగ్ డివైస్‌ల స్టోరేజ్‌ను మీ ఫోన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఆ డివైస్ One UI 8.5లో లేకపోయినా సరే, ఒక్కసారి అనుమతి ఇస్తే స్టోరేజ్ షేర్ అవుతుంది. Clock యాప్‌లో ఇప్పుడు అలారం సెట్చేసేటప్పుడు వాతావరణ బ్యాక్‌గ్రౌండ్‌ను జోడించవచ్చు. రోజు ప్రారంభంలోనే వాతావరణ సమాచారం కనిపించేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. Auracast ఆధారంగా One UI 8.5లో Audio Broadcasts సపోర్ట్ జోడించబడింది. యూజర్లు తమ వాయిస్‌ను బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను Quick Panel నుంచే యాక్సెస్ చేయవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ