మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా దౌత్యవేత్తలు సమావేశం అయ్యారు. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడి అల్లుడు జారెడ్ కుష్నర్ రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిపారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండానే సమావేశం ముగిసింది. ఈ మేరకు క్రెమ్లిన్ ప్రతినిధి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల తర్వాత పుతిన్ యూరోపియన్ దేశాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. యుద్ధం కోరుకుంటే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో సవరణలపై జెలెన్‌స్కీ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

Post a Comment

أحدث أقدم