యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సమావేశాలు డిసెంబర్ 8న ప్రారంభమ్యాయి. 13వ తేదీ వరకు జరగనున్నాయి. యునెస్కో ఇప్పటికే భారత్‌కు చెందిన 15 అంశాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో ఇంతకు ముందు కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామలీల మొదలైనవి ఉన్నాయి. తాజాగా యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వందల మంది ప్రతినిధులు వచ్చారు. కాగా, హిందువులు చేసుకునే అత్యంత సాంప్రదాయ పండుగలలో దీపావళి అతి ముఖ్యమైనది. ఈ పండుగను యునెస్కో జాబితాలో చేర్చడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తం చేశారు.
యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق