పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ను విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు.. 'పైలట్ లైసెన్స్ కుంభకోణం'తో కుదేలైన పీఐఏను కొనుగోలు చేసేందుకు నలుగురు బిడ్డర్లు అర్హత పొందారు. అయితే ఈ రేసులో వివాదాల సర్వసైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి $7 బిలియన్ల(రూ. 63,220 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ని విక్రయించాలని నిర్ణయించుకుంది. రుణాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకుంది. పీఐఏ విక్రయం అనేది గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన మేరకు పీఐఏ బిడ్డింగ్ 2025, డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ. 86 బిలియన్ల (రూ. 8,600 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు.
إرسال تعليق