ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమాన ప్రయాణికుడిపై దాడి చేసిన కేసులో ఎయిరిండియా పైలెట్ వీరేందర్ సెజ్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశం మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రయాణికుడిపై దాడి కేసులో అరెస్టయిన వెంటనే నిందితుడికి బెయిల్ మంజూరైంది. ఈ ఘటనతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ పైలట్‌ను ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. దాడి ఘటన గురించి ప్రయాణికుడు అంకిత్ దివాన్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయగా విమానయాన సంస్థ ఈ చర్య తీసుకుంది. తన కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చానని, టెర్మినల్-1లో సెక్యూరిటీ చెక్-ఇన్ వద్ద లైన్‌లో ఉండగా, కొందరు లైన్ మధ్యలోకి రావడంపై ప్రశ్నించానని వీడియో ద్వారా అంకిత్ దివాన్ వెల్లడించారు. ఇలా ప్రశ్నించినందుకుగాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ వీరేందర్ సెజ్వాల్ దుర్భాషలాడడంతో పాటు తనపై భౌతిక దాడి చేశాడని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
విమాన ప్రయాణికుడిపై దాడి చేసిన ఎయిరిండియా పైలెట్ అరెస్టు !
الثلاثاء، 30 ديسمبر 2025
Air India pilot arrested for assaulting a passenger Air India pilot Virender Sejwal granted bail immediately after his arrest in the assault case national
ليست هناك تعليقات:
إرسال تعليق