ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ పరిధిలోని ఏబీకే హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న రావు డానిష్ అలీ (డానిష్ రావు)ని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. రాత్రి 9 గంటల సమయంలో మౌలానా ఆజాద్ లైబ్రరీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డానిష్ అలీ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి వాకింగ్‌కు వెళుతూ లైబ్రరీ క్యాంటీన్ సమీపానికి చేరుకోగానే, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని అడ్డుకున్నారు. వారిలో ఒకరు డానిష్ అలీని ఉద్దేశించి, 'నీకు నేను ఎవరో తెలియదు, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపడతావు' అంటూ అతని తలపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అలీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దుండగులు అక్కడి నుండి పారిపోయారు.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఏబీకే హైస్కూల్ కంప్యూటర్ సైన్స్ టీచర్‌ను కాల్చి చంపిన దుండగులు
الخميس، 25 ديسمبر 2025
Aligarh Muslim University's ABK High School Miscreants shot and killed a computer science teacher uttara pradesh national
ليست هناك تعليقات:
إرسال تعليق