ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. ముప్పాళ్ల మండలం రుద్రవరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది. రాజుపాలెం ఆర్.ఆర్. సెంటర్‌కు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు సాలమ్మ కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే చనిపోయిన ఇద్దరి శాంపిల్స్ టెస్టుల కోసం ముంబై పంపించారు. పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందినట్లు రిపోర్టుల్లో తేలినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం రిపోర్టుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకకపోయినా, కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق