రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని రాష్ట్రంలో తిరుగుతున్నావు !

الأحد، 7 ديسمبر 2025

BJP has staged a protest at Dharna Chowk Revanth Reddy is roaming around the state with what face telangana Union Minister Kishan Reddy

t f B! P L


హైదరాబాద్ లోని ధర్నాచౌక్‌లో రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మార్పు కోసం అంటూ, అభయ హస్తం అంటూ వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారు. సోనియా, రాహుల్, ప్రియాంకలు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని రాష్ట్రంలో తిరుగుతున్నావు, ఏమీ నెరవేర్చావో ఎందుకు చెప్పడం లేదు? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్, సన్న బియ్యం అంటున్నావు, సన్నబియ్యంలో ఎక్కువ నిధులు కేంద్రానివే అని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏ మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు సమాధానం చెప్పాలి. గులాబి పోయి చెయ్యి గుర్తు వచ్చింది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు అంతే తప్పా ఏ మార్పు రాలేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. కేసీఆర్ హయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.. రాష్ట్రంలో ఇదే పరంపర కొనసాగుతోంది. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు అయితే ఇందిరా పార్క్ దగ్గర చర్చకు సిద్ధమా? ప్రజా భవన్, ప్రెస్ క్లబ్ అయిన ఓకే.. మా కార్యకర్త ఎవరైనా సిద్ధం. పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది. భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి. లక్ష కోట్లు మద్యం అమ్మకం ద్వారా సంపాదించాలని అనుకుంటుంది. ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు అక్రమాలకు పెద్ద పీట వేసే పార్టీలు.  కుటుంబ పార్టీలు, ఫిరాయింపులకు పాల్పడే పార్టీలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ