ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌ తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానన్నారు వైఎస్‌ జగన్‌. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి మద్దతే తన బలమని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఎక్స్‌లో టాప్‌ ట్రెండింగ్‌గా 'హ్యాపీ బర్త్‌ డే వైఎస్‌ జగన్‌' నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్‌ఫారమ్‌లలోనూ పోస్టులతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. వైఎస్‌ జగన్‌ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్‌ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్‌ వీడియోలు, ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Post a Comment

أحدث أقدم