ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్న రాముడు కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్‌ను మాధురి కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే అత్తింటి వారి వేధింపులు భరించలేక కేవలం నాలుగు నెలల్లోనే పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నాళ్ల నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిన మాధురి తాజాగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాజేష్ ట్రాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తండ్రి చిన్న రాముడు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదని, తానే దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ చేయించానని అన్నారు. అబ్బాయి కుటుంబ సభ్యులకు నంద్యాల పోలీసుల సమక్షంలో మ్యారేజ్ చేస్తానని చెప్పినా వద్దన్నారని తెలిపారు. అంతకు ముందు కూడా మరో అమ్మాయిని ఇలానే చేశాడని.. తర్వాత వారి ఊళ్లో ఎంక్వైరీ చేస్తే తెలిసిందని అన్నారు. రాజేష్ విలాసాలకు అలవాటు పడి ఇలా అమ్మాయిని మోసం చేస్తున్నాడని, తనతో పడని వారి బైక్‌లు, ఇతర వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టడం అతడి హాబీ అని చిన్న రాముడు చెప్పుకొచ్చారు. మాధురి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం వాళ్ల తల్లిదండ్రులేనని భర్త రాజేశ్ ఆరోపించాడు. ఈ మేరకు ఇవాళ అతడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓ వీడియోను విడుదల చేశాడు. మాధురి, తాను నాలుగైదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. అయినా, తాము పెళ్లి చేసుకోవడం వాళ్ల తల్లిదండ్రులకు నచ్చలేదని చెప్పకొచ్చాడు. మాధురికి ప్రెగ్నెన్సీ వచ్చినా, గర్భనిరోధక మాత్రలు ఇచ్చి ఆమెకు అబార్షన్ అయ్యేలా చేశారని ఆరోపించాడు. కూతురు బీటెక్ ఫెయిల్ అయిందనే కోపం కూడా వాళ్లకు ఉందని పేర్కొన్నాడు. వాళ్ల వేధింపులు తట్టుకోలేక తన భార్య మాధురి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని రాజేశ్ తెలిపాడు.
إرسال تعليق