యూరప్‌ను 'సూపర్‌ఫ్లూ' వణికిస్తోంది. దీనిని హెచ్3ఎన్2 అని పిలుస్తారు. ఇది ఇన్‌ఫ్లుఎంజా జాతిలో భారీగా మార్పు చెందిన వేరియంట్. 'సూపర్‌ఫ్లూ' ఆకస్మిక పెరుగుదలతో ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా ఏ (H3N2)కు చెందిన 'కే-స్ట్రెయిన్' ఇప్పుడు యూకేలో దాదాపు 90శాతం ఫ్లూ కేసులకు కారణంగా నిలుస్తోంది. ఇది ఫ్రాన్స్, స్పెయిన్, ఇతర దేశాలకు కూడా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నిపుణులు దీనిని అత్యంత తీవ్రమైన ఫ్లూ వేవ్ అని హెచ్చరిస్తున్నారు. గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి ఫ్లూ కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఈ సంక్షోభం యూకే ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆస్పత్రులలో పడకలు, సిబ్బంది కొరత ఏర్పడింది. పలు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది అధికంగా గైర్హాజరవుతున్నారు. కొన్ని చోట్ల ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు, సామూహిక సమావేశాలను నిషేధించారు. ఫ్రాన్స్‌లోని ఆస్పత్రులలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. స్పెయిన్‌లో ఫేస్ మాస్క్‌లు, ఫ్లూ మందులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పలు ఫార్మసీలు ఈ డిమాండ్‌ను తట్టుకోలేక అవస్థలు పడుతున్నాయి.
యూరప్‌ను వణికిస్తున్న సూపర్‌ఫ్లూ : రికార్డు స్థాయి కేసులు నమోదు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق