జనవరి 8న వన్ ప్లస్ టర్బో 6, వన్ ప్లస్ టర్బో 6 వీ స్మార్ట్ ఫోన్స్ విడుదల

الاثنين، 29 ديسمبر 2025

dual-camera setup and an LED flash OnePlus Turbo 6 OnePlus Turbo 6V Smartphones to be launched on January 8th science technology

t f B! P L


చైనాలో వన్ ప్లస్ టర్బో 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు జనవరి 8న విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ లో వన్ ప్లస్ టర్బో 6, వన్ ప్లస్ టర్బో 6 వీ స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. వన్ ప్లస్ అధికారిక Weibo పోస్ట్ ప్రకారం  లైవ్ ఈవెంట్ ద్వారా ఫోన్ల డిజైన్‌తో పాటు ముఖ్య ఫీచర్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ రెండింటికీ ఒకేలా కనిపించే డిజైన్ ఉండనుంది. వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా ఐలాండ్ ఉండగా ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు LED ఫ్లాష్ ఉంటుంది. ఫోన్లకు మ్యాట్ ఫినిష్ ఫ్రేమ్ ఉండగా, కలర్‌కు మ్యాచ్ అయ్యే ఎడ్జ్‌లను అందించారు. టర్బో 6 మోడల్ బ్లాక్, సిల్వర్, టర్కాయిస్ కలర్స్‌లో వస్తుండగా టర్బో 6 వీ  బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. టర్బో 6 వీ లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వచ్చే ఈ ఫోన్‌కు IP68 + IP69 + IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం విశేషం. ఈ ఫోన్‌కు పవర్ అందించేది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్. దీనితో పాటు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్, Adreno 825 GPU లభిస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 16పై రన్ అవుతుంది. టర్బో 6లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 8MP సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 9,000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.టర్బో 6తో పాటు లాంచ్ కానున్న టర్బో 6 వీ లో కూడా చాలా ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అయితే ఇందులో Snapdragon 7s Gen 4 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ, కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు టర్బో 6 మాదిరిగానే ఉంటాయని కంపెనీ టీజ్ చేసింది. మొత్తంగా శక్తివంతమైన ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో టర్బో 6 వీ సిరీస్ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ