తెలంగాణ పోలీసులు టాలీవుడ్ ను వెంటాడుతున్న పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మకు అడ్డుకట్ట వేశారు. పైరసీ ముఠా నుండి ఇండస్ట్రీని కాపాడిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు  రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. అనంతర మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ ‘ దమ్ముంటే పట్టుకొండని పోలీసులకు సవాల్ చేసి, భస్మాసుర హస్తం లా తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడు ఇమ్మడి రవి. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఏది ఎవరికీ ఊరికే రాదు. ఐ బొమ్మ లో ఉచితంగా సినిమాలు ఎలా వస్తున్నాయి. అలా ఎలా ఇస్తున్నారని మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా. మీరు ఐ బొమ్మలో సినిమాలు చూస్తుంటే మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అసలు అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలి అంటే ఎంతో డబ్బు కావాలి. ఇమ్మడి రవికి ఆ డబ్బు ఎలా వస్తుంది. ఆ పైరసీ సైట్స్ లో సినిమాలో చూసి మీకు తెలియకుండా ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు. మా సినిమా వాళ్ళ కంటే మీరే ఎక్కువగా నష్టపోతున్నారు. ఐ బొమ్మ రవిని పట్టుకుని అరెస్ట్ చేసి, పైరసీ వెబ్ సైట్స్ ను కట్టడి చేసిన తెలంగాణ పోలీసుశాఖ వారికి సీపీ సజ్జనార్ కు థాంక్యూ’ అని అన్నారు.

Post a Comment

أحدث أقدم