హైదరాబాద్ లోని పాత బస్తీకి చెందిన వివాహిత కుటుంబ కలహాలతో తన రేండేళ్ల కూతరితో ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మ హత్య చేసుకుంది. బహదూర్ పురలో వ్యాపారం చేస్తున్న పృధ్వీలాల్, అతడి భార్య కీర్తిక అగర్వాల్. వీరికి రెండేళ్లు కుమార్తె బియ్యారా ఉంది. అయితే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో.. ఆమె రెండేళ్ల నుంచి తమ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈనెల 2న రెండేళ్ల కూతురుతో కలిసి కీర్తిక అగర్వాల్ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నెక్లెస్ రోడ్డులోని నీరా కేప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. వివరాలు లభించకపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గత వారం క్రితం తమ కూతురు, మనవరాలు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు కీర్తిక తల్లిదండ్రులు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కీర్తిక అగర్వాల్ గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే మంగళవారం పాప డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. తల్లి కూతుర్ల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాలను కీర్తిక తల్లిదండ్రులకు అప్పగించారు.
కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమార్తెతో కలిసి ట్యాంక్ బండ్ లో దూకి వివాహిత ఆత్మహత్య
الأربعاء، 5 نوفمبر 2025
Criem hyderabad Married woman commits suicide by jumping into tank bund along with two-year-old daughter due to family dispute telangana
ليست هناك تعليقات:
إرسال تعليق