ఐటీ మద్రాస్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ కోర్సు రిజిస్ట్రేషన్లు ఆరంభం అయ్యాయి. జనవరి-ఏప్రిల్ 2026 బ్యాచ్‌కు సంబంధించిన కోర్సు ఇది. ఆసక్తిగల వారు SWAYAM NPTEL ప్లాట్‌ఫామ్ లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన నోట్స్ పొందవచ్చు, అసైన్‌మెంట్లు చేయవచ్చు, మెటీరియల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ పరీక్షకు మాత్రం 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, మైండ్‌ట్రీ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ బాలరామన్ రవీంద్రన్ ఈ 12 వారాల ఫౌండేషన్ కోర్సును బోధిస్తారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ కింద లో యూజీ/పీజీ చేస్తోన్న విద్యార్థులకు ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మేథమేటిక్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్ లో సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, షార్ట్‌కట్ ట్యుటోరియల్‌కు మించి మెషిన్ లెర్నింగ్ లో నైపుణ్యాన్ని సాధించాలనుకునే వారికి ఈ కోర్సు నేర్చుకోవచ్చు. తమ సబ్జెక్టులపై మరింత పట్టు సాధించవచ్చు. కోర్సు వ్యవధి జనవరి 19 నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు, నవంబర్ 17 నుండి జనవరి 26 వరకు రిజిస్ట్రేషన్లు, పరీక్ష రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13 నుండి ఫిబ్రవరి 13 వరకు, పరీక్ష తేదీ ఏప్రిల్ 17 (ఇందులో మార్పులు ఉండొచ్చు), ఉదయం సెషన్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు. మధ్యాహ్నం సెషన్: మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు. ఈ పరీక్ష ఆఫ్ లైన్ లో ఉంటుంది. ప్రొక్టార్డ్, ఎన్పీటీఈఎల్ కేంద్రాల్లో జరుగుతుంది. ఐఐటీ మద్రాస్ 2026 మెషిన్ లెర్నింగ్ కోర్సును కాన్సెప్ట్-డ్రైవెన్ గా రూపొందించింది. అల్గారిథమ్స్, లీనియర్, మల్టీవేరియట్ రిగ్రెషన్, ష్రింకేజ్, సబ్‌సెట్, లాజిస్టిక్ రిగ్రెషన్, డిస్క్రిమినెంట్ అనాలిసిస్, పెర్సెప్ట్రాన్, బేసిక్ న్యూరల్ నెట్‌వర్క్‌, రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌కు సంబంధించిన పలు ఆబ్జెక్ట్ లను ఇందులో నేర్చుకోవచ్చు. 25 శాతం అసైన్‌మెంట్స్ ఉంటాయి. సర్టిఫికేట్ పొందడానికి తప్పనిసరిగా అసైన్‌మెంట్ కనీసం 25కు 10 స్కోర్ చేయాలి. ప్రొక్టార్డ్ పరీక్షలో కనీసం 75 కు 30 మార్కులు స్కోర్ చేయాలి.

Post a Comment

أحدث أقدم