భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి (206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) శతకంతో చెలరేగగా, మార్కో జాన్సెన్ (91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (4/115), జస్‌ప్రీత్ బుమ్రా (2/75), మహమ్మద్ సిరాజ్ (2/106), రవీంద్ర జడేజా (2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. 247/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ముత్తుసామి అసాధారణ బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కైల్ వెర్రెన్(122 బంతుల్లో 5 ఫోర్లతో 45)తో కలిసి ఏడో వికెట్‌కు 88 పరుగులు జోడించిన ముత్తుసామి.. జాన్సెన్‌తో కలిసి 8వ వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. సిమన్ హర్మర్(5) విఫలమైనా.. కేశవ్ మహరాజ్ సైతంతో కలిసి మార్కో జాన్సెన్ భారీ స్కోర్ అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.
రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు : ముత్తుసామి శతకం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق