టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దనుష్ ఫైనల్లో 252.2 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచాడు. తద్వారా డెఫ్లంపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్‌గా శ్రీకాంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. సూరత్‌కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో రెండు పతకాలూ భారత్‌కే దక్కాయి. ఈ డెఫ్లంపిక్స్‌లో సత్తాచాటిన ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఆదివారం హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
స్వర్ణ పతకం సాధించిన షూటర్ ధనుష్‌కు భారీ నజరానా
الأحد، 16 نوفمبر 2025
10m air rifle event cash prize of Rs. 1 crore 20 lakhs Gold medalist Dhanush gets a big reward Hyderabad-based shooter sports telangana
ليست هناك تعليقات:
إرسال تعليق