తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నక్క మోషే (లేటు), నక్క సుజాత దంపతుల కుమార్తె నక్క బ్లెస్సి (18) శరీరంలోని అవయవాలకు ఇన్ఫెక్షన్ చొరబాటంతో శనివారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతూ చలాకీగా ఉండే బ్లెస్సి, వారం రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురై మలమూత్రాలు ఆగిపోవడంతో హుటాహుటిన బంధువుల సాయంతో పాల్వంచలో వైద్యం అందించినట్లు తెలిపారు. బ్లెస్సి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం యువతి మృతి చెందింది. ఈ ఘటన తెలిసిన పలువురు అంబేద్కర్ నగర్ కాలనీలో ఇలాంటి మరణాలు సర్వసాధారణమైపోయాయని, కాలుష్యంలో బ్రతుకుతున్నామని, కాపాడాలని 35 రోజుల పాటు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని వాపోయారు. సింగరేణి షైలో బంకర్ వ్యర్థాల బారి నుంచి పునరావాసం కోరిన తమకు పునరావాసం కల్పించకపోగా, కాలనీలో వరుస మరణాలకు కారణమైన వాయు, నీటి కాలుష్యాల తీవ్రత పై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా పిన్న వయసుకు చెందిన యువతీ, యువకులు మృతి చెందడం పై కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కాలనీవాసులు త్రాగే నీరు, పీల్చే గాలి పై పరీక్షలు నిర్వహించి కాలుష్య తీవ్రతను అంచనా వేయాలని, కాలనీలో సంభవిస్తున్న వరుస మరణాలపై ఆరా తీయాలని కోరుతున్నారు.
సింగరేణి కాలుష్యంతో యువతి మృతి ?
الأحد، 23 نوفمبر 2025
Ambedkar Nagar Colony Khammam Kishtaram village under Sathupalli mandal telangana Young woman dies due to Singareni pollution?
ليست هناك تعليقات:
إرسال تعليق