కర్ణాటక ప్రభుత్వం డిజిటల్ యుగంలో భారీ ఆవిష్కరణ చేసింది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి KEO (నాలెడ్జి-డ్రైవెన్, ఎకనామికల్, ఓపెన్ సోర్సెస్) అనే మినీ కంప్యూటర్‌ను తయారు చేసింది. ప్రస్తుత డిజిటల్ యుగంతో పోటీ పడాలంటే విద్యార్థులకు కంప్యూటర్ల తప్పనిసరని అందుకే ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా ఏఐ సహాయంతో రాష్ట్రంలోనే మినీ కంప్యూటర్ రూపొందించినట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ప్రస్తుత ఏఐ యుగంలో టెక్నాలజీని వాడుకోవాలంటే స్మార్ట్ డెవైస్ అనేవి తప్పనిసరి అవి లేకుంటే కాలంతో పోటీపడడం చాలా కష్టమవుతుంది. విద్యార్థులలో అయితే ఈ పోటీ మరింత అధికంగా ఉంటుంది. ఆన్ లైన్ క్లాసులని, ప్రాజెక్టులని ఇలా టెక్నాలజినీ వాడుకొని చేసే పనులు ఎన్నో ఉంటాయి. అయితే చాలా మంది విద్యార్థులకు వారి ఆర్థిక పరిస్థితి రీత్యా కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసే శక్తి ఉండదు. దీంతో కాలంతో పోటీపడలేక వెనకబడిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఏఐ సాంకేతికతను వాడి KEO అనే చిన్న కంప్యూటర్‌ను తయారు చేసింది. RISC-V ప్రాసెసర్, BUDDH అనే ఆన్-డివైస్ AI ఇంజిన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 శాతం లోపు ఇళ్లలో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా దాదాపు 60 శాతం విద్యార్థులకు కంప్యూటర్లు లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులు, ఇతరాత్రా ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నాయి. దాదాపు 45 శాతం పాఠశాలలలో అసలు కంప్యూటర్లే లేవని దీంతో విద్యార్థులు డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను అందించడానికి KEONICS సహాయంతో మినీ కంప్యూటర్ తయారు చేసినట్లు ఆరాష్ట్ర ఐటి మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఏఐ సాయంతో మినీ కంప్యూటర్ రూపకల్పన చేసిన కర్ణాటక ప్రభుత్వం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق