ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి ముందు ఉగ్ర ముఠా భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్రణాళిక రచించింది. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో దాడులకు పాల్పడాలని వీరు ప్రయత్నించారు. సూసైడ్ బాంబర్, డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి పని చేసిన జసిర్ బిలాల్ వానీ ఉరప్ డానిష్ ఈ భయానక వివరాలను వెల్లడించాడు. ఇతనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శ్రీనగర్‌లో అరెస్ట్ చేసింది. కారు బాంబు పేలుడుకు ముందే, డ్రోన్లకు భారీ ఆయుధాలను అమర్చి, రాకెట్లను తయారు చేసి, రద్దీ ప్రదేశాల్లో దాడులకు పాల్పడేందుకు సాంకేతిక సహకారాన్ని డానిష్ అందించాడని ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. సూసైడ్ బాంబర్ ఉమర్‌తో సహ కుట్రదారుగా డానిష్ పని చేసినట్లు తెలిపింది. మీడియా కథనాల ప్రకారం, పెద్ద బ్యాటరీలతో అత్యంత శక్తిమంతమైన బాంబులను తీసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయడంలో అతనికి అనుభవం ఉంది. రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ల దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారు.
రద్దీ ప్రదేశాల్లో డ్రోన్లతో హమాస్ తరహా దాడులకు కుట్ర !
الثلاثاء، 18 نوفمبر 2025
aka Danish Hamas-style drone attacks in crowded places Jasir Bilal Wani national revealed these horrifying details who worked with suicide bomber Dr. Umar-un-Nabi
ليست هناك تعليقات:
إرسال تعليق