సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్‌లను కూడా అప్‌లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం. క్లౌడ్‌ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లో అంతర్గత సర్వర్ లోపం, దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను వేలమంది యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెళ్లదీస్తున్నారని డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. ఈ సమస్యపై కంపెనీ స్పందించలేదు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఈ సమస్య భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు మొదలైంది. క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ అవ్వడం వల్ల కేవలం ఎక్స్ మాత్రమే కాకుండా.. ఓపెన్ ఏఐ సంస్థల సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో మా బృందం నిమగ్నమై ఉందని క్లౌడ్‌ఫ్లేర్ టీమ్ వెల్లడించింది.
ఎక్స్, ఓపెన్ ఏఐ సేవల్లో అంతరాయం
الثلاثاء، 18 نوفمبر 2025
Open AI companies have been stopped Open AI Services Outage science technology The outage is said to be caused by a Cloudflare outage X
ليست هناك تعليقات:
إرسال تعليق