జేడీయూ నేత నితీష్ కుమార్ ఎన్డీయే నేతగా బుధవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైంది. పాట్నాలోని గాంధీ మైదానంలో గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీష్ ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి తదితరులు హాజరయ్యారు. నితీష్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా బలపరిచారు. ఎన్డీయే నేతగా నితీష్ కుమార్ ఎన్నికకావడంతో ఆయన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఈసాయంత్రం కలుసుకోనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పిస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు.
إرسال تعليق