దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టులను పేల్చి వేస్తామంటూ ఈరోజు బెదిరింపులు వచ్చాయి. ఆ జాబితాలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అందులో భాగంగా బస్ స్టాప్‌లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేశారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే పబ్లిక్ ప్లేసెస్ వద్ద బాంబ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీ వేళ ఈ సోదాల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లు పేల్చేస్తామంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి ఈ మెయిల్ అందింది. ఈ ఎయిర్ లైన్స్ అధికారులు వెంటనే ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు ఎయిర్‌పోర్ట్‌ల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. ఆ క్రమంలో ఆయా ఎయిర్ పోర్టుల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు
الأربعاء، 12 نوفمبر 2025
five major cities of the country will be blown up Hyderabad Airport is also on the list Police conduct intensive checks in Hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق