భారత్ కు ఎగుమతి చేస్తున్న డిస్కౌంట్ చమురును తగ్గించుకోవాలని రష్యా ఆయిల్ రిఫైనరీలు నిర్ణయించాయి. అక్టోబర్ నెల ఆరంభ వారాలతో పోలిస్తే చివరి వారానికి భారత్ కు ఎగుమతి చేస్తున్న చమురును రోజుకు 1.95 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.19 మిలియన్ బ్యారెళ్లకు తగ్గించేసినట్లు అంతర్జాతీయ వెసెల్ ట్రాకర్ కెప్లర్ డేటా చెబుతోంది. ఈ మేరకు రష్యా చమురు రిఫైనరీలు రోజ్ నెఫ్ట్, లూక్ ఆయిల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరో నెల రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ను రష్యా చమురు కొనకుండా ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన ట్రంప్, ఇప్పుడు ఆ దేశ చమురు రిఫైనరీలను టార్గెట్ చేయడం ద్వారా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు అర్దమవుతోంది. అదే జరిగితే భారత చమురు రిఫైనరీలు ఇప్పుడు రష్యా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే దుబాయ్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాలను ఈ విషయంలో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమెరికా నుంచి కూడా చమురు దిగుమతులు పెంచే అవకాశాలున్నాయి.
భారత్ కు డిస్కౌంట్ చమురును తగ్గించుకున్న రష్యా ఆయిల్ రిఫైనరీలు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق