శ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం వద్ద ఆదివారం తెల్లవారుజామున అనేక భారీ పేలుళ్లు సంభవించాయి. వాతావరణ సంస్థ ప్రకారం మొదటి పేలుడు తెల్లవారుజామున 1 గంటలకు సంభవించింది. ఆ తరువాత ఉదయం 2:30, ఉదయం 8:50 గంటలకు మరో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు పేలుళ్లు చాలా శక్తివంతమైనవని, వీటి కారణంగా లావా, బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసాయని వెల్లడించింది. గత 13 నెలల్లో బూడిద ఇంత ఎత్తుకు చేరుకోవడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. కగోషిమా నగరం దాని పరిసర ప్రాంతాలపై దట్టమైన బూడిద పొర పేరుకుపోవడంతో అక్కడ దృశ్యమానత గణనీయంగా తగ్గింది. విమానాశ్రయంలో కూడా పరిస్థితి మరింత దిగజారింది. భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 30 విమానాలు రద్దు చేశారు. ప్రయాణీకులు చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. నగర పరిపాలన అధికారులు మాట్లాడుతూ ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సకురాజిమా అగ్నిపర్వతం వద్ద చిన్న చిన్న విస్ఫోటనాలు సర్వసాధారణం, కానీ ఈసారి పేలుడు దాటి ఎక్కువగా ఉంది, ఫలితంగా బూడిద, వేడి వాయువులు చాలా ఎక్కువగా బయటకు వచ్చాయి అని వెల్లడించాయి. శాస్త్రవేత్తలు రాడార్, ఉపగ్రహాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم