న్ లైన్ మోసాలను అరికట్టడానికి ఫోన్ పే ప్రొటెక్ట్ అనే ప్రత్యేక ఫీచర్‌ను ఫోన్ పే తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా కాదా అని మీకు తెలుస్తుంది. ఈ ఫీచర్‌ను ఫోన్ పే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కూడా ప్రదర్శించింది. ఈ ఫీచర్ కోసం ఫోన్ పే భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి డేటాను ఉపయోగిస్తుంది. డాట్ ఇటీవల ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అనే కొత్త సాధనాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్ ఆర్థిక మోసానికి సంబంధించిన మొబైల్ నంబర్‌లను ట్రాక్ చేస్తుంది. ప్రభుత్వ రికార్డులలో “హై రిస్క్” అని గుర్తించబడిన నంబర్‌కు మీరు ఫోన్ పేలో చెల్లింపు చేస్తే, ఫోన్ పే ఆటోమేటిక్ గా చెల్లింపును బ్లాక్ చేస్తుంది. లావాదేవీ ఎందుకు బ్లాక్ చేయాల్స వచ్చిందో స్క్రీన్‌పై వివరణను ఇస్తుంది. చెల్లించబడుతున్న నంబర్ “మీడియం రిస్క్”తో అనుబంధించబడితే, యాప్ మిమ్మల్ని సందేశంతో హెచ్చరిస్తుంది. ఆపై చెల్లింపు చేయాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడి ప్రజలు యూపీఐ ద్వారా అనుమానాస్పద నంబర్‌లకు డబ్బు పంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనుమానాస్పద నంబర్‌ల గురించి వినియోగదారులను ముందుగానే అప్రమత్తం చేసే ఈ ఫీచర్, ఎవరికీ డబ్బు పంపకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్‌లైన్ చెల్లింపులకు వాచ్‌డాగ్ అని కూడా పిలుస్తారు.

Post a Comment

أحدث أقدم