ఎస్‌బీఐ 'పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' పాలసీ !

الخميس، 6 نوفمبر 2025

applicable road accidents business earthquakes but also for natural disasters like snake bites and scorpion bites electric shock Floods national SBI 'Personal Accident Insurance' Policy

t f B! P L


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారుల కోసం అత్యంత చౌకైన వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందిస్తోంది. రోజుకు కేవలం రూ.6 కన్నా తక్కువ ప్రీమియంతో ఏకంగా రూ.40 లక్షల బీమా ప్రయోజనం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఎస్‌బీఐ ఈ ప్రత్యేకమైన 'పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' పాలసీని అందిస్తోంది. ఈ పథకంలో చేరడానికి ఖాతాదారులు ఏడాదికి రూ.2000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని రోజువారీగా లెక్కిస్తే కేవలం రూ.5.48 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఊహించని ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.ఈ బీమా పథకం పరిధి చాలా విస్తృతంగా ఉంది. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పాముకాటు, తేలుకాటు వల్ల మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.40 లక్షల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకంలో చేరాలనుకునే ఎస్‌బీఐ ఖాతాదారులు తమ సమీపంలోని బ్యాంకు శాఖను సంప్రదించి, తమ సేవింగ్స్ ఖాతా నుంచి ఏటా ప్రీమియం ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేందుకు అనుమతి ఇస్తే సరిపోతుంది. ఖాతాదారుల సౌలభ్యం కోసం వివిధ ప్రీమియం ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడాదికి రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల బీమా, కేవలం రూ.100 చెల్లిస్తే రూ.2 లక్షల బీమా సౌకర్యం పొందవచ్చు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ