హైదరాబాద్‌లో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య రేపు నిర్వహించే అధ్యాపక సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. జూబ్లీహిల్స్ ఎప ఎన్నిక ఉన్నందున సెక్యూరిటీ ఇవ్వలేమన్న ప్రభుత్వం స్పష్టం చేసింది. అధ్యాపక సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్‌పై జస్టీస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. అధ్యాపక సభకు ఎల్బీ స్టేడియం లేదా మరోచోట అయినా పర్లేదని అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య లాయర్ కోరారు. అయితే, కాలేజీల బంద్ బర్నింగ్ ఇష్యూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఎంటని న్యాయస్థానం ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు హైదరాబాద్ సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అధ్యాపక సభకు వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అధ్యాపక సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరణ
الجمعة، 7 نوفمبر 2025
Federation of Higher Education Institutions government has made it clear security cannot be provided as Jubilee Hills is the only election Telangana High Court denies permission for faculty meeting
ليست هناك تعليقات:
إرسال تعليق