ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీలో మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ నిర్ణయంతో ఇప్పటికే విద్యార్థులు హాస్టల్‌లు ఖాళీ చేసి తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. 

Post a Comment

أحدث أقدم