పుష్కర్‌ జంతువుల మేళాలో రూ.21 కోట్ల విలువైన దున్నపోతు హఠాన్మరణం

الاثنين، 3 نوفمبر 2025

A video of the buffalo's death has gone viral on social media national Pushkar Animal Fair in Rajasthan The sudden death of a buffalo worth Rs 21 crore

t f B! P L


రాజస్థాన్‌లోని పుష్కర్‌ జంతువుల మేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన రూ.21 కోట్ల విలువైన దున్నపోతు హఠాన్మరణం కలకలం రేపింది. లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించిన ఈ మేళాకు, ఆ దున్నపోతే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ భారీ విలువైన దున్నపోతును ప్రత్యేక ఏర్పాట్ల మధ్య రాజస్థాన్‌లోని పుష్కర్‌కు తీసుకువచ్చారు. దాని ఆరోగ్యం శుక్రవారం క్షీణించడంతో, వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యుల బృందాన్ని హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపారు. కానీ, దాని అధిక శరీర బరువు, వేగంగా క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా వైద్యులు ఎంత ప్రయతి్నంచినా ఆ మూగజీవిని కాపాడలేకపోయారు. దున్నపోతు చనిపోయిన దృశ్యాలున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చనిపోయిన దున్నపోతు చుట్టూ సందర్శకులు, సంరక్షకులున్న ఈ వీడియో వేలాది మంది నెటిజన్లను కదిలించింది. నటి స్నేహ ఉల్లాల్‌ స్పందిస్తూ.. 'మరిన్ని హార్మోన్లు, యాంటీబయాటిక్స్, గ్రోత్‌ హార్మోన్లను ప్రేరేపించండి. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ.. దాన్ని సహజం అని పిలవండి. మీరంతా రోగగ్రస్థ మనుషులు'.. అని మండిపడ్డారు. 'ఇది వ్యాపారం పేరుతో సాగించిన జంతు హింస'.. అని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు. 'ఇది హఠాన్మరణం కాదు. బీమా కోసం దాన్ని చంపాలని ప్లాన్‌ చేశారు.'.. అని ఇంకో నెటిజన్‌ ఆరోపించారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ