అమెరికాలోని టెక్సాస్‌లో గురువారం జరిగిన టెస్లా కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో సీఈఓ ఎలాన్ మస్క్‌కు రికార్డు స్థాయిలో 1 ట్రిలియన్ డాలర్లు ( రూపాయల్లో సుమారు రూ.83 లక్షల కోట్లు) విలువైన వేతన ప్యాకేజీని కంపెనీ వాటాదారులు భారీ మెజారిటీతో ఆమోదించారు. ఓటింగ్ ఫలితాలు ప్రకటించిన వెంటనే, మస్క్ స్టేజ్‌పైకి వచ్చి టెస్లా రూపొందించిన మానవ రూప రోబోట్ అయిన 'ఆప్టిమస్'తో కలిసి డ్యాన్స్ చేసి, సమావేశానికి హాజరైన అభిమానులను, ఇన్వెస్టర్లను ఉర్రూతలూగించారు. ఎలాన్ మస్క్‌కు చెల్లించనున్న ఈ భారీ వేతన ప్యాకేజీని ఏకంగా 75 శాతానికి పైగా సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు బలపరిచారు. ఈ ఆమోదం మస్క్ స్థాయిని మరింత పెంచింది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, ఈ ప్యాకేజీలో నిర్దేశించిన అత్యంత ఆశావహ లక్ష్యాలను చేరుకోగలిగితే, చరిత్రలో మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. మస్క్ వేతనం పూర్తిగా టెస్లా పనితీరుతోనే ముడిపడి ఉంది. కంపెనీ మార్కెట్ విలువను నేటి 1.5 ట్రిలియన్ డాలర్ల నుండి 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం వంటి పలు కఠినమైన ఆర్థిక, కార్యాచరణ మైలురాళ్లను సాధిస్తేనే ఆయనకు ఈ ప్యాకేజీ లభిస్తుంది. ఈ కీలక ప్రకటన వెలువడిన వెంటనే, టెస్లా షేర్లు ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో దాదాపు 1 శాతం పెరిగాయని రాయిటర్స్ నివేదించింది. ఓటింగ్ ఫలితాలు తన ప్యాకేజీకి అనుకూలంగా రావడంతో ఉబ్బితబ్బిబ్బైన ఎలాన్ మస్క్.. వేదికపైకి వచ్చి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ అయిన ఆప్టిమస్‌తో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేసి, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మస్క్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ, "షేర్‌హోల్డర్ల ఓట్లకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆమోదాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. మేము ఇప్పుడు ప్రారంభించబోయేది కేవలం టెస్లా కథలో ఒక కొత్త అధ్యాయం మాత్రమే కాదు, మొత్తం కొత్త పుస్తకం అవుతుంది. ఇతర కంపెనీల AGMలు నిద్రమత్తును తెప్పిస్తాయి, కానీ మా సమావేశాలు బ్యాంగర్స్ (అద్భుతంగా) ఉంటాయి" అని పేర్కొన్నారు. ఈ భారీ వేతన ప్యాకేజీని అందుకోవాలంటే, మస్క్ రాబోయే దశాబ్దంలో ఈ క్రింది సాహసోపేతమైన వృద్ధి లక్ష్యాలను ఛేదించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాలు నెరవేరితే, టెస్లాలో ఆయనకు అదనంగా 12 శాతం వాటా లభించనుంది:
ఎలాన్ మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన వేతన ప్యాకేజీ
الجمعة، 7 نوفمبر 2025
automobile business Elon Musk gets $1 trillion pay package science shareholders overwhelmingly approved technology Tesla annual general meeting in Texas
ليست هناك تعليقات:
إرسال تعليق