సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించారు. మెహిదీపట్నం ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా 45 మంది టికెట్లు బుక్ చేసుకుని ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ నెల 9 తేదీన హైదరాబాద్ నుంచి ఉమ్రాకు వెళ్లారు. మక్కాయాత్రను పూర్తిచేసుకుని మదీనా వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తనకు తెలిసిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సౌదీలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడానని అసదుద్దీన్ తెలిపారు. మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని అన్నారు.
సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 16 మంది హైదరాబాదీలు !
الاثنين، 17 نوفمبر 2025
16 Hyderabadis killed in Saudi Arabia road accident 45 people booked tickets through Mehidipatnam Fly Zone Agency national telangana
ليست هناك تعليقات:
إرسال تعليق