ఆంధ్రప్రదేశ్ వైపుకు మొంథా తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని 28న కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొంథా తుపాను నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపానును ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్, టెలికాం, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాన్ వల్ల కలిగే నష్టాలను వెంటనే పరిష్కరించాలని, సముద్రంలో ఉన్న పడవలను వెనక్కి రప్పించాలని ఆయన సూచించారు. ఈ తుపాన్ సన్నాహక చర్యలను పర్యవేక్షించడానికి, జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

أحدث أقدم