సౌదీ అరేబియాలో జాయ్ ఫోరం 2025 అనే కార్యక్రమంలో సినీ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొని బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇందులో సల్మాన్ బలూచిస్తాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ప్రజలు అందరూ సౌదీ అరేబియాలో కష్టపడి పని చేస్తున్నారని అని చెప్పారు. సల్మాన్ వ్యాఖ్యలకు బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు ఆనందంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం కోపంతో రగిలిపోతోంది. ఇప్పటికే పాకిస్తాన్, బలూచిస్తాన్‌ల మధ్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతోంది. బలూచిస్తాన్ తమను తాము వేరే దేశంగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో సల్మాన్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సల్మాన్ ఖాన్‌ను నాల్గవ షెడ్యూల్‌లో ఉంచింది. ఈ జాబితా ఉగ్రవాద నిరోధక చట్టం కిందకు వస్తుంది. ఇందులో వ్యక్తులు పాకిస్తాన్‌లో చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటారు. దీనిపై పాకిస్తాన్ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
إرسال تعليق