హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుజూర్‌నగర్ కు చెందిన శ్రీనివాసరావు ఐటీ ఉద్యోగి. నల్లగండ్లలోని ఓ అపార్ట్మెంట్స్ లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోన్నారు. ఆస్తి విషయంలో కొంతకాలంగా భార్యతో శ్రీనివాసరావుకు గొడవలు జరుగుతుండేవని ఆయన తల్లి చెబుతున్నారు. ఈ వివాదం ముదరడంతో ఇరు కుటుంబాల పెద్దలు వచ్చి నచ్చజెప్పారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. అపార్ట్మెంట్ 14వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ నుండి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆయన తల్లి కమలమ్మ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు జ్యోతి కారణమని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. తనతో పాటు శ్రీనివాసరావు పేరు మీద ఉండే ఆస్తులన్నింటినీ కూడా తన పేరు మీద బదలాయించాలని జ్యోతి రోజూ తన కుమారుడితో గొడవపడుతుండేదని, మానసికంగా వేధించేదని కమలమ్మ చెబుతున్నారు. దీన్ని భరించలేక శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారనేది ఆమె వాదన.
14వ అంతస్తు నుండి దూకి బలవన్మరణానికి పాల్పడ్డ ఐటీ ఉద్యోగి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق