తెలంగాణలో సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహక చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించి మాట్లాడుతూ ఏడాది లో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాదని, దేశంలో ఎవరు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు.14 ఏళ్ల తర్వాత మేమే గ్రూప్ 1 ఉద్యోగాలు నియామకాలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. చిక్కుముడులు విప్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నామని, యువత ఆలోచించాలని కోరారు. మా ప్రయత్నాన్ని గమనించండని విన్నవించారు. జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించారు. అలాగే సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా కోటి రూపాయల నుంచి కోటి 25 లక్షలు పెంచనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం చేసుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
సివిల్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి రూ. లక్ష చెక్కును అందజేసిన రేవంత్ రెడ్డి !
الأحد، 5 يناير 2025
14 ఏళ్ల తర్వాత మేమే గ్రూప్ 1 ఉద్యోగాలు నియామకాలు చేశాం 143 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది telangana ఏడాది లో 55 సివిల్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి రూ. లక్ష చెక్కును అందజేసిన రేవంత్ రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق