భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ''ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉంటుంది. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది'' అని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ పేర్కొన్నారు. సీజనల్ శ్వాసకోశ సంబంధింత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్‌లోని ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జన్యు పరివర్తన జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం మినహాయించి హెచ్‌ఎంపీవీ వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ ఓ మీడియా సంస్థతో చెప్పారు. ప్రస్తుత రకం వైరస్‌తో ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు. హ్యూమన్ మెటానిమోవైరస్ అనేది ఇదివరకే తెలిసిన వైరస్. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 12శాతం వరకు ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌ని పోలి ఉండే ఈ వైరస్.. ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. సాధారణంగా 11ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. తొలిసారిగా దీనిని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.
హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆందోళన అవసరం లేదు : కేంద్ర ఆరోగ్యశాఖ
الاثنين، 6 يناير 2025
కేంద్ర ఆరోగ్యశాఖ చిన్నారుల్లో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాప్తిలో ఉంది వృద్ధుల్లో ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కువ హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆందోళన అవసరం లేదు
ليست هناك تعليقات:
إرسال تعليق